![]() |
![]() |

శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇందులో రాము మాస్టర్ తన టీమ్ నుంచి కొంత మంది స్కూల్ స్టూడెంట్స్ ని తీసుకొచ్చారు. వాళ్ళు "బటర్ ఫ్లై, బటర్ ఫ్లై" సాంగ్ కి డాన్స్ పెర్ఫార్మ్ చేశారు. ఇప్పుడు ఈ సాంగ్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఐపోయాక ఇంద్రజ వాళ్ళను, వాళ్ళ డాన్స్ ని తెగ మెచ్చేసుకుంది. సీట్ నుంచి దిగి వచ్చి వాళ్ళతో కలిసి కొన్ని స్టెప్పులు కూడా వేసింది.
ఇంద్రజ, రష్మీ డాన్స్ చూసిన ఆది "మీ ఇద్దరిలో ఆ కుర్రతనం పోలేదేహే" అని కామెంట్ చేసాడు. "ఎందుకలా డైలాగ్స్ వేస్తారు ఈ పిల్లల బుంగ మూతి వేసుకుని చూస్తున్నారు ఆపేయొచ్చుగా ఆ డైలాగ్స్" అని ఇంద్రజ ఆదిని అనేసరికి "మీ బుంగమూతి కూడా బాగుందండి" అని రివర్స్ డైలాగ్ వేసాడు. దాంతో ఇంద్రజ "మీ దొంగ మూతి కంటే మా బుంగ మూతి బెటర్" అని ఇంకో కౌంటర్ వేశారు. ఇక ఆదికి కోపం వచ్చేసింది.
"ఇంకోసారి ఈ బటర్ ఫ్లై సాంగ్ వినిపిస్తే ఊరుకోను" అనేసరికి స్కూల్ పిల్లలంతా ఆదిని, నాటీ నరేష్ ని ఫుల్ గా చెడుగుడు ఆడేసుకున్నారు. "మీరు ఆ సాంగ్ కి డాన్స్ వేయండి లేదంటే ఊరుకోము.. ఐనా మీరు నా డాన్స్ ని కాపీ చేస్తున్నారేంటి.. ముందు మీరు తొమ్మిదవ ఎక్కం చెప్పండి..ఇంగ్లీష్ మాట్లాడండి.. ఐనా మీ జోక్స్ ఇక్కడ కాదు వేసేది బయటకు వెళ్లి వేయండి. ట్రాఫిక్ పోలీస్ కి శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎం పని" అంటూ ఆది మీద ఫుల్ ఫైర్ అయ్యారు. నాటీ నరేష్ ఎక్స్ట్రా చేస్తే కొడతాను అంటూ మీదిమీదికెళ్లారు ఆ స్కూల్ చిన్నారులు. "ఏంటి కథలపడుతున్నావ్...ఊరుకోను" అనేసరికి అందరూ ఆ పిల్లల మాటలకు షాకైపోయారు. ఇలా ఈ షోలో చిన్నారులు ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఇక ఆ పిల్లలు ఎక్కడా ఆగకపోయేసరికి వాళ్ళను బలవంతంగా రష్మీ బయటకు పంపించాల్సి వచ్చింది.
![]() |
![]() |